వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో బైకు డబ్బుల వ్యవహారంలో యువకుడిని నిర్బంధించి, తాళ్లతో చేతులు కట్టి, మెడలో తాడు వేసి వీధుల్లో తిప్పిన ఘటనపై పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
రామచంద్రరాజుపేటకు చెందిన ఎల్లా రాజేశ్ను ఈ నెల 5న మెకానిక్ షెడ్లో నిర్బంధించి హింసించి, మరుసటి రోజు వీధుల్లో తిప్పినట్లు ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
Comments
Loading comments...

