వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క

ముత్యాలంపాడు క్రాస్ రోడ్‌లో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతరాయంగా వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఇలాంటి ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, విద్యుత్ శాఖాధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...