Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ఎండీలో భారాస వినూత్న నిరసన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jun 28, 2026 12:14 PM కరీంనగర్General
ఎల్ఎండీలో భారాస వినూత్న నిరసన - Udayam
కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ) అడుగంటడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారాస శ్రేణులు ఎండిపోయిన జలాశయంలో ఆటలాడి నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని గంగుల విమర్శించారు. రెండు దశాబ్దాల చరిత్రలో జులై నాటికి ఎల్‌ఎండీ డెడ్‌ స్టోరేజీకి పడిపోవడం ఇదే తొలిసారి అన్నారు. చేతకాకపోతే చెబితే, తామే వెళ్లి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేసి నీరందిస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...