Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్‌తో ప్రజలకు మెరుగైన వైద్యం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 11, 2026 12:26 PM కడపGeneral
ఆయుష్‌తో ప్రజలకు మెరుగైన వైద్యం - Udayam
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద నిధులు మంజూరు చేయడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.3 కోట్లతో 10 నూతన ఆస్పత్రి భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. హోమియో, ఆయుర్వేదం, యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సమృద్ధిగా మందులు, వైద్యుల నియామకంతో పాటు అధునాతన భవనాలు అందుబాటులోకి రావడంతో రోగులకు ఎంతో మేలు చేకూరనుంది. త్వరలోనే ఈ నూతన భవనాలను ప్రారంభించనున్నట్లు ఆయుష్‌ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...