Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బదిలీపై వెళ్తున్న ఏఓ శ్రీనివాస్‌కు ఎస్పీ శుభాకాంక్షలు

Follow Udayam on Google
నిర్మల్ Sep 05, 2026 5:09 PM నిర్మల్General
బదిలీపై వెళ్తున్న ఏఓ శ్రీనివాస్‌కు ఎస్పీ శుభాకాంక్షలు - Udayam
నిర్మల్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వహించి జగిత్యాల జిల్లాకు బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్‌ కు పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా ఎస్పీ డాక్టర్‌ జానకి షర్మిల శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్మల్‌ జిల్లాలో ఏఓగా శ్రీనివాస్‌ అందించిన సేవలను కొనియాడారు. జగిత్యాల జిల్లాలో చేపట్టనున్న నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...