Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం

Follow Udayam on Google
Rohit Singh May 27, 2026 2:26 PM జాతీయంవినోదం
హీరో రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం - Udayam
‘డాన్‌ 3’ చిత్రం నుంచి తప్పుకున్నందుకుగానూ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌పై ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌’ (FWICE) నిషేధం విధించింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వల్ల నిర్మాతలకు వచ్చిన రూ.45 కోట్ల నష్టపరిహార వివాదం పరిష్కారమయ్యే వరకు ఆయనతో కలిసి పనిచేయవద్దని పరిశ్రమను ఆదేశించింది. కీలక దశలో పేరుపొందిన నటులు ప్రాజెక్ట్‌ల నుంచి వైదొలగడం సినీ పరిశ్రమ స్థిరత్వానికి ముప్పని ఫెడరేషన్‌ పేర్కొంది. రణ్‌వీర్ చర్చలకు సహకరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన సంస్థ, భవిష్యత్తులో ఈ విషయంపై మరింత చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

Comments

G
Loading comments...