వార్తలకు తిరిగి వెళ్లండి

బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్దానికులు తెలిపిన వివరాల ప్రకారం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో మరడాం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న గుగ్గిలపు నారాయణరావును రామభద్రపురం నుంచి వస్తున్న గుర్తుతెలియని బైక్ వెనుక నుంచి ఢీకొట్టి పరారైంది.
తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికుల హుటాహుటిన విజయనగరం లోని మహారాజ ఆసుపత్రిలో చేర్పించారు.
Comments
Loading comments...

