వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగూర్ గ్రామ శివారులో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన నక్కను సురక్షితంగా బయటకు తీసి సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు మానవత్వం చాటుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే అధికారులతో మాట్లాడి రెస్క్యూ చర్యలు చేపట్టించారు.
బేస్ క్యాంప్ సాంబన్న ఆధ్వర్యంలో నక్కకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బయటకు తీశారు. స్పందించిన సర్పంచ్, బేస్ క్యాంప్ సాంబన్నను గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

