Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాహుదా ఉగ్రరూపం.. జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 11:59 AM అమరావతిGeneral
బాహుదా ఉగ్రరూపం.. జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు - Udayam
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు, ఒడిశాలోని భగలట్టి డ్యామ్‌ గేట్లు ఎత్తడంతో ఇచ్ఛాపురం వద్ద బాహుదా నది ఉప్పొంగింది. వరద నీరు 16వ నంబర్‌ జాతీయ రహదారిపైకి చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈనెసుపేట, లొద్దపుట్టి, పెటూరు, జగన్నాథపురం, రాత్తకన్నా తదితర ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. నది ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Comments

G
Loading comments...