వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో ఉద్యోగులందరికీ 100 శాతం పోలీస్ వెరిఫికేషన్ నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలను కూడా ట్రస్ట్ కోరింది.
పోలీసులు జారీ చేసే ప్రవర్తనా ధ్రువీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి చేసింది. ఆలయ భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

