వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లెక్కింపు వ్యవస్థలో కఠిన మార్పులు చేసింది. భద్రతను పెంచుతూ సిబ్బందికి జేబులు లేని ప్రత్యేక ముదురు నీలం రంగు దుస్తులను తప్పనిసరి చేసింది.
మొబైల్ ఫోన్లు, కెమెరాలను పూర్తిగా నిషేధించిన అధికారులు.. సిబ్బంది నేలపై కూర్చొని నగదు లెక్కించేలా ఆదేశాలిచ్చారు. గత ఐదేళ్ల ఆలయ నిధులపై ఆడిట్ నిర్వహించేందుకు సిట్ రంగంలోకి దిగింది.
Comments
Loading comments...

