వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నిర్మాణం సెప్టెంబరు 30 నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఎల్‌అండ్‌టీ, టాటా నిర్మాణ సంస్థల ప్రతినిధులు మరో నెలపాటు అక్కడే ఉంటారని చెప్పారు.
ఆడిటోరియం, మ్యూజియం పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ప్రహరీగోడ డిసెంబరులోగా పూర్తవుతుందని తెలిపారు.
Comments
Loading comments...

