Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య విరాళాల చోరీ కేసు: షాకింగ్ నిజాలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 01, 2026 12:21 PM జాతీయంGeneral
అయోధ్య విరాళాల చోరీ కేసు: షాకింగ్ నిజాలు - Udayam
అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆలయ లెక్కింపు గది తాళాలు దక్కించుకున్న నిందితులు, అక్కడ దొంగిలించిన సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా వాష్‌రూమ్‌లలో దాచి బయటకు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మందిలో ఒకరైన అవినాష్‌ శుక్లాను పోలీసులు విచారించగా ఈ విషయాలు తెలిశాయి. లెక్కింపు వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని టిన్నూ యాదవ్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.

Comments

G
Loading comments...