Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి: అంగన్వాడీ సిబ్బందికి అవగాహన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:15 PM నెల్లూరుGeneral
ఉదయగిరి: అంగన్వాడీ సిబ్బందికి అవగాహన - Udayam
ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అంగన్వాడీ సిబ్బందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సీడీపీవో పుణ్యవతి ఆధ్వర్యంలో డీఆర్‌పీలు సుబ్బారెడ్డి, ఫణిరాజు, హనీఫ్‌ ఆరోగ్యం, పోషకాహారం, లింగ సమానత్వం, చిన్నారుల సంరక్షణ తదితర అంశాలపై సిబ్బందికి వివరించారు. చిన్నారుల ఆరోగ్యం, అభివృద్ధిలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు.

Comments

G
Loading comments...