Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేరు 5% పతనం

Follow Udayam on Google
సాయి తేజ Aug 10, 2026 10:46 AM ఆల్ ఇండియా మార్కెట్
రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేరు 5% పతనం - Udayam
ఈడీ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు నేపథ్యంలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు సోమవారం 5% పతనమై రూ.72.74 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. గత ఐదు సెషన్లలో షేరు 9.9% పెరిగింది. నాలుగు ఎన్‌హెచ్‌ఏఐ రహదారి ప్రాజెక్టుల నిధుల్లో సుమారు రూ.187 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఈడీ ఆరోపించింది. నకిలీ పత్రాలు, ఇన్‌వాయిస్‌లతో లావాదేవీలను చట్టబద్ధంగా చూపించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...