Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

Follow Udayam on Google
Mohammad Aug 15, 2026 2:00 PM అనంతపురంవినోదం
అనంతపురంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి - Udayam
అనంతపురం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించారు. అంతకుముందు అందరితో కలిసి వందేమాతరం పాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...