Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో పొలాల దారికి చెత్త అడ్డంకి

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:07 PM సూర్యాపేటGeneral
అనంతగిరిలో పొలాల దారికి చెత్త అడ్డంకి - Udayam
అనంతగిరి మండలం వసంతాపురంలో పొలాలకు వెళ్లే దారిలో పంచాయతీ చెత్త వేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు విన్నవించినా కార్యదర్శి పట్టించుకోవడం లేదని రైతు భూక్యా నగేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దారి మూసుకుపోవడంతో వ్యవసాయ పనిముట్లు తీసుకెళ్లలేకపోతున్నామని, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...