Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 5:02 PM వికారాబాద్General
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు - Udayam
పెద్దఅంబర్‌పేట్ అంగన్వాడీ సెంటర్‌లో ఆగస్టు 2వ విడతలో ఇచ్చిన 8 గుడ్లు కుళ్లినవి వచ్చాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తీసుకున్న గుడ్లలో రెండింటిని శుక్రవారం ఉడకబెట్టి, పొట్టు తీస్తుండగా కుళ్లిన వాసనతోపాటు డార్క్ కలర్‌లో కనిపించాయని ఓ మహిళ మండిపడ్డారు. ఈ గుడ్లు తెలియక పసిపిల్లలు, గర్భిణులు, బాలింతలు తింటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...