వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల కేంద్రంలోని ఫస్ట్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం టీచర్స్ డే వేడుకలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ఉపాధ్యాయుల వేషధారణలో ముస్తాబై ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు తోటి పిల్లలకు పాఠాలు చెప్పి అలరించారు.
అంగన్వాడీ టీచర్ సత్యశీల ఉపాధ్యాయుల ప్రాధాన్యతను, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి పాత్రను వివరించారు. కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

