Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ.. పెచ్చులు ఊడి ప్రమాదకరం!

Follow Udayam on Google
Naresh Aug 13, 2026 12:37 PM నిర్మల్తెలంగాణ
కుబీర్ మండలంలోని పెంటునాయక్ తండాలో పాత ఎంపీయూపీఎస్ భవనంలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం ముందు భాగం పెచ్చులు ఊడి కిందపడ్డాయి. రాత్రి వేళల్లో జరగడంతో ప్రమాదం తప్పింది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఈ పాత స్కూల్ భవనంలో చిన్నారులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి కొత్త భవనం కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...