వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరు పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న రామన్న చెరువు అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయి. చెరువు అభివృద్ధికి NREGS నుంచి సుమారు రూ.9.50 లక్షలు, పంచాయతీ నిధుల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు చేసినట్లు స్థానికులు తెలిపారు.
అయినా పనులు పూర్తికాలేదన్నారు. అధికారులు స్పందించి మిగిలిన పనులు పూర్తి చేసి చెరువును అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

