Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'తుంబాడ్ 2'లో అలియా భట్

Follow Udayam on Google
శివ కుమార్ Jul 14, 2026 9:09 PM జాతీయంవినోదం
'తుంబాడ్ 2'లో అలియా భట్ - Udayam
వైవిధ్యభరితమైన కథాంశంతో ఘనవిజయం సాధించిన 'తుంబాడ్' చిత్ర సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించనున్నారు. ఆమె తమ టీమ్‌లోకి వచ్చినట్లు నటుడు, నిర్మాత సోహం షా మంగళవారం అధికారికంగా ప్రకటిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో ఫోటోలను పంచుకున్నారు. 2018లో విడుదలై క్లాసిక్‌గా నిలిచిన 'తుంబాడ్', 2024 రీ-రిలీజ్‌లోనూ రూ. 27 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారీ అంచనాలు ఉన్న ఈ సీక్వెల్ 'తుంబాడ్ 2' వచ్చే ఏడాది డిసెంబరు 3న విడుదల కానుంది.

Comments

G
Loading comments...