వార్తలకు తిరిగి వెళ్లండి

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని మేక మాంసం, కోడి మాంసం, చేపల విక్రయ దుకాణాలకు అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని జీవీఎంసీ పరిధిలోని అన్ని మాంసం, కోడి మాంసం, చేపల విక్రయ దుకాణాలు అక్టోబర్ 2న తప్పనిసరిగా మూసివేయాలని అలాగే ఆరోజు జంతు వధశాలలకు సెలవు ప్రకటించడమైనదని కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

