Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 11:55 AM శ్రీకాకుళంGeneral
అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు - Udayam
నరసన్నపేట మండలం జమ్ము జంక్షన్ వద్ద విజయవాడ నుంచి టెక్కలి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దహనమైంది. ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...