వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలంలోని కొరమ-బత్తిలి రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోందని వాహనదారులు వాపోయారు.
దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను వెంటనే పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

