Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా బొబ్బిలి-పాత బొబ్బిలి రోడ్డు

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 4:06 PM విజయనగరంGeneral
అధ్వానంగా బొబ్బిలి-పాత బొబ్బిలి రోడ్డు - Udayam
బొబ్బిలి-పాతబొబ్బిలి రోడ్డు అధ్వానంగా మారింది. దావాలవీధి జంక్షన్ నుంచి ఆర్.సి.ఎం చర్చి వరకు రోడ్డుపై పెద్దపెద్ద గోతులు, అక్కడ నుంచి పాత బొబ్బిలి వరకు అక్కడక్కడ గోతులు ఉండడం వలన ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురవడంతో గోతులలో నీరు చేరడం వలన గోతులలో ద్విచక్ర వాహనాలు దిగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...