వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌కు 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మరో 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 75, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ కాలేజీకి 25 అదనపు సీట్లను మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మౌలిక వసతుల అభివృద్ధి, ప్రొఫెసర్ల నియామకాల వల్లే ఈ అనుమతులు లభించాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
Comments
Loading comments...

