Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్బాయిపాలెంలో కోతుల దాడి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 11:47 AM మహబూబాబాద్ General
 అబ్బాయిపాలెంలో కోతుల దాడి - Udayam
మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో కోతుల బెడద పెరుగుతోంది. ఇంటి ముందు పనులు చేస్తుండగా కోతులు దాడి చేయడంతో జినక సోమమ్మ తీవ్రంగా గాయపడ్డారు. కుమార్తె పద్మ ఆమెను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలిని సీపీఐ(ఎం) నాయకులు పరామర్శించారు. కోతులను పట్టుకుని గ్రామం నుంచి తరలించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నందిపాటి వెంకన్న డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...