వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తల్లి శ్రీదేవిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు.
తమ నివాసంపై దాడి జరగడంతో ఆమె గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారని సంజయ్ వెల్లడించారు. అనంతరం వైద్యుల నుంచి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, వర్షిత్ రెడ్డికి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

