Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

95% హాజరు ఉంటేనే టీచర్లకు సెలవులు

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 11:17 AM హైదరాబాద్General
95% హాజరు ఉంటేనే టీచర్లకు సెలవులు - Udayam
విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు 95 శాతం దాటితేనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు. సెలవులకు అడిషనల్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలపై 672 పాఠశాలల్లోని 6,200 మంది ఉపాధ్యాయులు, సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అత్యవసర సమయాల్లోనూ అనుమతి తీసుకోవడం కష్టమని, ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Comments

G
Loading comments...