Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి పేరుపై 69 విద్యుత్తు కనెక్షన్లు నమోదు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 1:01 PM కాకినాడGeneral
మృతుడి పేరుపై 69 విద్యుత్తు కనెక్షన్లు నమోదు - Udayam
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో మృతుడి పేరు, ఆధార్ నంబరుపై 69 విద్యుత్తు కనెక్షన్లు నమోదైనట్లు గుర్తించారు. దీంతో ఓ కుటుంబం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధికి దూరమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి పేరుపై కనెక్షన్లు ఎలా నమోదయ్యాయో పరిశీలిస్తున్నామని విద్యుత్తు శాఖ ఏఈ లోవరాజు తెలిపారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...