వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి: ఈనెల 29న ఉదయం 10 గంటలకు సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి హాకీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాలోని హాకీ క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలని కోరారు.
ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో రావాలని సూచించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

