Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ సెంచరీ తర్వాత బదోని శతకం

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:01 PM జాతీయంక్రీడలు
డబుల్‌ సెంచరీ తర్వాత బదోని శతకం - Udayam
రంజీ ట్రోఫీ 2026-27లో ఢిల్లీ కెప్టెన్‌ ఆయుశ్‌ బదోని వరుసగా మరో సెంచరీ సాధించాడు. గుజరాత్‌పై 217 పరుగులు చేసిన అతడు జార్ఖండ్‌తో మ్యాచ్‌లో తొలి రోజు 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బదోని శతకంతో ఢిల్లీ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 309 పరుగులు చేసింది. సుమిత్‌ మాథుర్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Comments

G
Loading comments...