Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైస్‌ మిల్లులో రూ.11 కోట్ల ధాన్యం గల్లంతు

Follow Udayam on Google
సాయి తేజ Jul 30, 2026 11:45 AM మహబూబ్‌నగర్General
రైస్‌ మిల్లులో రూ.11 కోట్ల ధాన్యం గల్లంతు - Udayam
మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని రైస్‌ మిల్లులో రూ.11.34 కోట్ల విలువైన ధాన్యం కొరతను అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖల తనిఖీల్లో 5,070 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయం అయినట్లు తేలింది. అనుమతి లేకుండా సీఎంఆర్‌ ధాన్యం తరలిస్తున్న రెండు లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిల్లులు, గోదాంలపై పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...