వార్తలకు తిరిగి వెళ్లండి

ఉడాన్ పథకం కింద వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒక్కో విమానాశ్రయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
అధిక ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ నిర్మాణాలు చేపడతామని తెలిపారు. దేశవ్యాప్తంగా 200 హెలీపోర్టులను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

