వార్తలకు తిరిగి వెళ్లండి

ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ అద్వితీయ ప్రదర్శన కనబరిచింది. టోర్నీ చివరి రోజు కూడా పతకాలు సాధించి, మొత్తం 16 మెడల్స్‌తో (5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్‌లో హేమంత్ బర్మన్ రజతం గెలవగా, ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జుహైర్ ఖాన్–ఆద్యా కత్యాల్ జోడీ కాంస్యం సాధించింది. అంతర్జాతీయ వేదికపై భారత యువ షూటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది.
Comments
Loading comments...

