Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు

ధీరజ్ రెడ్డి Jul 16, 2026 8:40 AM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago
డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు - Udayam Digital
కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నులను పెంచుతూ, పెట్రోల్‌పై తగ్గించింది. జూలై 16 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో పెట్రోల్‌పై లీటరుకు రూ.2.50కు తగ్గగా, డీజిల్‌పై రూ.15.50కు, ఏటీఎఫ్‌పై రూ.14.50కు పెరిగింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల అస్థిరత నేపథ్యంలో ఈ సవరణలు చేసినట్లు కేంద్రం తెలిపింది. అయితే ఈ మార్పులు కేవలం ఎగుమతి సుంకాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...