వార్తలకు తిరిగి వెళ్లండి

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు వ్యవసాయ బావి వద్ద సోమవారం రాత్రి దొంగలు విద్యుత్ సామగ్రిని అపహరించినట్లు బాధితులు తెలిపారు. బోరు మోటార్‌కు చెందిన 20 మీటర్ల వైరు, ఫ్యూజులు, స్టార్టర్ డబ్బా, ఆటోమేటిక్ తదితర సామగ్రిని ఎత్తుకెళ్లారు.
చోరీతో రైతుకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

