Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెన లేక ఐదు గ్రామాల ఎన్నికల బహిష్కరణ

Follow Udayam on Google
Harika Nov 05, 2026 3:09 PM అల్లూరి General
అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. చంపాపట్టి, శీలంగొంది, జాకారవలస, ఉయ్యాలగూడతో పాటు మరో గ్రామానికి చెందిన వారు ఓటు వేయడానికి నిరాకరించారు. వాగు దాటేందుకు వంతెన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలుమార్లు అధికారులకు విన్నవించినా పరిష్కారం లభించలేదని గ్రామస్థులు తెలిపారు. నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Comments

G
Loading comments...