వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండాలో వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రైమరీ పాఠశాల ఆవరణలో సోమవారం మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

