Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 14, 2026 11:01 PM వికారాబాద్తెలంగాణ
వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా కలిసి పరిశీలించారు. వేదిక, సీటింగ్, బందోబస్తు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలలో లోపాలు లేకుండా చూసుకోవాలని, మైదానాన్ని చదును చేసి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈసారి వేడుకల్లో మొదటిసారిగా వందేమాతరం, జనగణమనతో పాటు జయ జయహే తెలంగాణ గీతాలాపన ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...