వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ ముందు పోలీస్ శాఖ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసింది. అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్లకుండా భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కలెక్టర్ ను కలిసేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తామని చెప్పారు. కలెక్టర్ వద్దకు వెళ్లి నిరసనలు, ధర్నాలు చేపట్టకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

