వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం సీతాపురం, తిర్లంగి పంచాయతీలకు చెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాల నుంచి సుమారు 500 మంది టీడీపీలో చేరారు. ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్న వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గ్రామాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బగాది శేషగిరిరావు, బెండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

