Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మంపేటలో వైద్యుడి డిప్యూటేషన్ రద్దుకు డిమాండ్

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 3:04 PM వరంగల్General
తిమ్మంపేటలో వైద్యుడి డిప్యూటేషన్ రద్దుకు డిమాండ్ - Udayam
పల్లె దవాఖానా వైద్యుడు పృథ్వీరాజ్ విధులకు సక్రమంగా హాజరుకాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ మోడం శ్రీలత ఆరోపించారు. దవాఖానాను సందర్శించినప్పుడు వైద్యుడు లేకపోవడంతో పాటు గడువు ముగిసిన మందులు కనిపించాయని తెలిపారు. బీపీ, షుగర్, సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో లేక ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...