Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నదిలో ముగ్గురు యువకుల మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 9:45 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణా నదిలో ముగ్గురు యువకుల మృతి - Udayam
విజయవాడలోని కృష్ణలంక మెట్ల బజారు పద్మావతి ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు. మృతులను గడ్డం జాషువా (17), వీసం గౌతమ్‌ (18), తిగుళ్ల తేజ (18)గా గుర్తించారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...