వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబస్తీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మూడు మౌలిక వసతుల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.242.72 కోట్ల అంచనా వ్యయంతో అనుమతిచ్చింది. ఒవైసీ ఫ్లైఓవర్ డౌన్ ర్యాంప్, ఆరులేన్ల గ్రేడ్ సెపరేటర్, బండ్లగూడ-ఎర్రకుంట ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఈ పనులను కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. సత్వరమే ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Loading comments...

