Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాసర ఆలయంలో చోరీ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jun 23, 2026 7:08 AM బాసరGeneral
బాసర ఆలయంలో చోరీ - Udayam
నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో చోరీ కలకలం రేపింది. ఆలయ పైఅంతస్తులోని మహంకాళి గుడి తాళాలు పగలగొట్టిన దుండగులు, అమ్మవారి వెండి కిరీటంతో పాటు నగదు ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. నగదు తీసుకున్న అనంతరం హుండీని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున అర్చకులు ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...