వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ వైఖరితో అసంతృప్తిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, బ్యాంకులోని సుమారు రూ. 5-6 వేల కోట్ల ప్రభుత్వ నిధులను ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. ప్రభుత్వ లావాదేవీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడంతో పాటు, ఎస్‌బీఐకి ఉన్న లీడ్ బ్యాంక్ హోదాను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
రాయదుర్గం భూముల విషయంలో ఎస్‌బీఐ వ్యవహారశైలిపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. జూన్ 22, 23 తేదీల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...

