వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో జరుగుతున్న 8వ ఇండియన్ ఓపెన్ అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పారాంపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ చరిత్ర సృష్టించారు. పురుషుల జావలిన్ త్రో ఎఫ్64 విభాగంలో 74.82 మీటర్ల దూరం విసిరి, తన సొంత ప్రపంచ రికార్డును సుమిత్ అధిగమించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
గతంలో 2022 ఆసియా పారా గేమ్స్‌లో సుమిత్ 73.29 మీటర్ల రికార్డును నెలకొల్పారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రవీణ్ కుమార్, దీప్తి జీవన్‌జీ వంటి క్రీడాకారులు కూడా అద్భుత ప్రదర్శనలతో బంగారు పతకాలను సాధించి, భారత కీర్తిని మరింత పెంచారు.
Comments
Loading comments...

