వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా కోహెడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో చురుగ్గా ఉండే విద్యార్థి మరణంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటన జరిగిన మూడు గంటల తర్వాత సమాచారం ఇవ్వడం, తల్లిదండ్రులు వచ్చేలోపే మృతదేహాన్ని తరలించడం వంటి చర్యలతో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరగాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Loading comments...
